New CJI : న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ (New CJI) కొలువు తీరనున్నారు. ఇప్పటికు సీజేఐగా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు తన పేరును సీజేఐగా ప్రకటించారు గవాయ్. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే 14వ తేదీన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. ఇదిలా ఉండగా తన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ ను నియమించాల్సిందిగా కేంద్ర న్యాయ శాఖ మంత్రికి, కేంద్ర సర్కార్ కు, రాష్ట్రపతి ముర్ముకు సిఫారసు చేశారు జస్టిస్ గవాయ్. నవంబర్ 23న తను పదవీ నుంచి తప్పుకోనున్నారు. ఇదే సమయంలో 24న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ సూర్యకాంత్.
New CJI Suryakanth Elected
మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా పూర్తి కాలం ఉంటారని సమాచారం. ఆయన ఫిబ్రవరి 9, 2027లో పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. కాగా మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీ, పదోన్నతికి మార్గనిర్దేశం చేసే పత్రాల సమితి, భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి నియామకం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉండాలని పేర్కొంది. ఫిబ్రవరి 10, 1962న హర్యానాలోని హిసార్ జిల్లాలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు జస్టిస్ సూర్య కాంత్, ఆర్టికల్ 370 రద్దు, స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వంపై మైలు రాయి తీర్పులు ఇచ్చారు.
Also Read : CM Road Show for Jubilee Hills Sensational : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రోడ్ షో
















