Raviteja : టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోలలో ఒకడు మాస్ మహారాజా రవితేజ (Raviteja). ఇటీవలే తను తండ్రి రాజ గోపాల్ రాజును కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన ఇంట్లో విషాదం అలుముకుంది. ఇక తను తాజాగా నటించిన చిత్రం మాస్ జాతర. దీనికి భాను గోగవరపు దర్శకత్వం వహించాడు. ఇందులో లవ్లీ బ్యూటీ శ్రీలీల కీ రోల్ పోషిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆరు నూరైనా సరే వచ్చే ఆగస్టు నెలలో 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మాస్ జాతర మూవీని రిలీజ్ చేయాలని కంకణం కట్టున్నట్లు తెలిపారు మూవీ మేకర్స్. రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
RavitejaMovie OTT Rights
మాస్ జాతర కు క్యాచీగా ఉండేలా క్యాప్షన్ కూడా పెట్టాడు దర్శకుడు . ఇదంతా మనదేనంటూ పేర్కొన్నారు. ఈ డైలాగ్ రవితేజ నటించిన పూరీ దర్శకత్వం వహించిన ఇడియట్ మూవీ లోనిది. గతంలో రవితేజ, శ్రీలీల ధమాకా సినిమాలో నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెద్ద ఎత్తున కాంబినేషన్ వర్కవుట్ అయ్యింది. ఆ తర్వాత తిరిగి వస్తున్న మూవీ మాస్ జాతర కావడం విశేషం. ఇక ధమాకాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది శ్రీలీల. తన అంద చందాలతో పాటు డ్యాన్సులతో హోరెత్తించింది. కుర్రకారు గుండెల్లో గునపాలు దించింది. మాస్ జాతర మూవీలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
మూవీ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ చేయడంతో మాస్ జాతర మూవీని చేజిక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ. 20 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు టాక్.
Also Read : Toranto Film Festival Interesting : టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ కు హోమ్ బౌండ్

















