Nepal PM KP Sharma : ఖాట్మండు : ఆందోళనలు, నిరసనల మధ్య గత్యంతరం లేక నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ధ్రువీకరించారు. వందలాది మంది ప్రదర్శనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆయన కార్యాలయంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఓలి (Nepal PM KP Sharma) రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు కొన్ని గంటల ముందు, సోమవారం జరిగిన మరణాలకు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తూ బాల్కోట్‌లోని నేపాల్ నాయకుడి ప్రైవేట్ నివాసానికి ప్రదర్శనకారులు నిప్పు పెట్టారు. సోషల్ మీడియా సైట్‌లపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల సందర్భంగా కనీసం 19 మంది మరణించారు. నిరసనల తర్వాత, ప్రభుత్వం నిన్న రాత్రి నిషేధాన్ని ఉప సంహరించుకుంది.
Nepal PM KP Sharma Oli Resigned
దీంతో పరిస్థితి దారుణంగా ఉండడంతో నేపాల్ ఆర్మీ చీఫ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఓలీని (Nepal PM KP Sharma) కోరారు. ఇక్కడే ఉంటే మీరు ప్రాణాలతో మిగిలి ఉండరని, ఇంతకు మించి తాము ఏమీ చేయలేమంటూ చేతులు ఎత్తేశారు. సురక్షితంగా బయటకు వెళ్లాలని కోరారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న విద్యార్థులు ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రత్యేక విమానంలో నేపాల్ ప్రధాని ఓలి చెక్కేశారు దుబాయికి. జనరల్ జెడ్ నేతృత్వంలోని నిరసనలు దేశ వ్యాప్తంగా హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్ రంగంలోకి దిగారు. రాజకీయ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దిగజారుతున్న పరిస్థితిని నియంత్రించాలని ఓలి ఆర్మీ చీఫ్‌తో మాట్లాడారు. ఓలి అధికారాన్ని వదులుకుంటేనే సైన్యం దేశాన్ని స్థిరీకరించగలదని జనరల్ సిగ్డెల్ ప్రతిస్పందించారు. ఓలి పదవీ విరమణ చేసిన తర్వాత సైన్యం జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆర్మీ వర్గాలు కూడా తెలిపాయి. ఇంతలో బలువతార్‌లోని తన అధికారిక నివాసం నుండి సురక్షితమైన మార్గాన్ని పొందడంలో ప్రధాన మంత్రి సైన్యం సహాయాన్ని కూడా అభ్యర్థించారు. దేశం విడిచి వెళ్లడానికి సహాయం కోరారు. వైద్య చికిత్స కోసం ఓలి దుబాయ్‌కు వెళ్లాలని యోచిస్తున్నారని, ప్రైవేట్ క్యారియర్ హిమాలయ ఎయిర్‌లైన్స్ సిద్ధంగా ఉంచినట్లు వర్గాలు తెలిపాయి.
Also Read : PVN Madhav Interesting Announcement : 22న రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సంబురాలు : మాధవ్

















