Neeraj Chopra Sensational : గోల్డెన్ స్పైక్ ఈవెంట్ లో అగ్రస్థానంలో నీరజ్ చోప్రా

ఇక గ్రెనడాకు చెందిన అథ్లెట్‌ అండర్సన్ పీటర్స్‌ 83.63 మీటర్ల త్రోతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు...

Hello Telugu - Neeraj Chopra Sensational

Hello Telugu - Neeraj Chopra Sensational

Neeraj Chopra : ఓస్ట్రావా, జూన్ 25: డైమండ్ లీగ్‌లో విజయం సాధించి జోరు మీదున్న ప్రపంచ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం జరిగిన ప్రతిష్ఠాత్మక ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్‌ అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లో జావెలిన్ విభాగంలో 85.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం సాధించాడు. ఈ ఈవెంట్‌లో టైటిల్‌ గెలవడం నీరజ్‌కు ఇది మొదటిసారి.

Neeraj Chopra Game Updates

ఈ పోటీలో మొత్తం తొమ్మిది మంది ప్రపంచ స్థాయి అథ్లెట్లు బరిలో నిలిచారు. ఇందులో దక్షిణాఫ్రికాకు చెందిన డౌ స్మిత్‌ 84.12 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక గ్రెనడాకు చెందిన అథ్లెట్‌ అండర్సన్ పీటర్స్‌ 83.63 మీటర్ల త్రోతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

తన మూడో ప్రయత్నంలోనే అత్యుత్తమ త్రో నమోదు చేసిన నీరజ్‌ మరోసారి ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌కు ముందు అతడి ఫార్మ్ ఆకర్షణీయంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Also Read : IND vs ENG 1st Test Victory : అబ్బా డ‌కెట్ దెబ్బ మామూలు లేదుగా

Exit mobile version