Naveen Yadav : హైదరాబాద్ : అందరి దృష్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైనే ఉంది. ఎవరు గెలుస్తారనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీలు బరిలో ఉన్నప్పటికీ వార్ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల మధ్యే కొనసాగుతోంది. ఇవాల్టితో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మొత్తం 81 మంది పోటీలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ (Naveen Yadav), బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి ఉన్నారు. ఆయా పార్టీలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేపట్టాయి. ఇందులో ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది.
Naveen Yadav Comments
తమ 10 ఏళ్ల కాలంలో తెలంగాణను ఎలా అభివృద్ది చేశామనే దానిపై ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మరో వైపు సెంటిమెంట్ ను కూడా రగల్చడంలో కొంత మేరకు ఓటు బ్యాంకు చీల్చే ఛాన్స్ ఉంది. ఇంకో వైపు అధికార పార్టీకి చెందిన నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ లో మంచి పేరుంది. పెళ్లిళ్లు, చావులకు అటెండ్ కావడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో తను ముందుంటారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఇంటింటికీ వెళ్లి తనకు ఓటు వేయాలని, గెలిపించాలని కోరారు నవీన్ యాదవ్. ఈ సందర్బంగా వారంతా తనకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఫుల్ ఖుష్ అయ్యారు అభ్యర్థి. జూబ్లీహిల్స్ లో ఎగిరేది మాత్రం హస్తం జెండానేనని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Visharadhan Maharaj Shocking Comments : నవీన్ యాదవ్ శరీరం బీసీది మెదడు రేవంత్ రెడ్డిది
















