Jairam Ramesh Shocking Comments : నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు బూట‌కం : జైరాం ర‌మేష్

కేంద్రం కావాల‌నే సోనియా, రాహుల్ పై క‌క్ష క‌ట్టింది

Hello Telugu - Jairam Ramesh Shocking Comments

Hello Telugu - Jairam Ramesh Shocking Comments

Jairam Ramesh : న్యూఢిల్లీ : నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ ప‌ర్స‌న్ జైరాం ర‌మేష్‌ (Jairam Ramesh). ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేవ‌లం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే కేసు న‌మోదు చేశారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇవాళ దేశంలో ఏ వ్య‌వ‌స్థ కూడా స‌క్ర‌మంగా ప‌ని చేయ‌డం లేద‌న్నారు. బీజేపీ జేబు సంస్థ‌లుగా మారి పోయాయ‌ని అన్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు. చివ‌ర‌కు స‌త్యం, ధ‌ర్మం, న్యాయమే గెలుస్తుంద‌ని పేర్కొన్నారు జైరాం ర‌మేష్‌. ఇదిలా ఉండ‌గా తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Jairam Ramesh Shocking Comments on National Herald Case

దీనిపై తీవ్రంగా స్పందించారు జైరాం ర‌మేష్‌. మోదీ, షా ద్వ‌యం పార్టీ అగ్ర నాయ‌క‌త్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేధింపులు, బెదిరింపులు, ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిప‌డ్డారు. ఈ చర్యను ఖండించారు. ఇదంతా బ‌క్వాస్, బూట‌కం, అబ‌ద్దం అంటూ పేర్కొన్నారు జై రాం ర‌మేష్‌. ఎన్ని కేసులు న‌మోదు చేసినా తాము వెన‌క్కి వెళ్లే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. స‌త్యం త‌మ వైపు ఉన్న‌ప్పుడు ఎందుకు భ‌య‌ప‌డాల‌ని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత‌. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి ప‌లుమార్లు సీబీఐ, ఈడీ విచార‌ణ కోసం పిలిచింద‌ని, అయినా ఏమీ తేల్చ‌లేక పోయింద‌న్నారు జైరాం ర‌మేష్‌.

Also Read : Abhishek Sharma Sensational Cricket : 12 బంతుల్లోనే అభిషేక్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ

Exit mobile version