Nasir Hussain : బెంగళూరు : కర్ణాటకలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం, సీఎం మార్పు వివాదంపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ (Nasir Hussain). ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కుట్రలకు, కుతంత్రాలకు తెర లేపడం మామూలేనని అన్నారు. ఆ పార్టీ తప్పా ఏ పార్టీ ఇక్కడ ఉండ కూడదని అనుకుంటోందన్నారు. తమ పార్టీ సర్కార్ కు ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఐదు సంవత్సరాల పాటు కొనసాగి తీరుతుందన్నారు ఎంపీ. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిసే ఉంటారని, ఎవరూ ఎక్కడికీ వెళ్లరని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు నసీర్ హుస్సేన్.
Nasir Hussain Key Comments
2028లో జరిగే తదుపరి ఎన్నికల్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల సారథ్యంలో తమ పార్టీ మరోసారి కర్ణాటకలో పవర్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఇక భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సమస్యలు లేవన్నారు. కేవలం ఇతర పార్టీలపై బురద చల్లడం, ఒకవేళ ఏదైనా పార్టీ పవర్ లో ఉంటే ఏదో రకంగా డిస్ట్రబ్ చేయడం, సర్కార్ ను చీల్చడం, కూల్చడం మాత్రమే చేస్తుందంటూ ధ్వజమెత్తారు ఎంపీ నాసిర్ హుస్సేన్. ఇచ్చిన హామీలు బాగా పని చేస్తున్నాయని. పాలన పరిపూర్ణంగా జరుగుతోందన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా నియంత్రణలో ఉందన్నారు.
Also Read : YS Sharmila Fired on CM Chandrababu : అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ దందా

















