ఢిల్లీ : ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ పదవీ విరమణ చేశారు. తను దాదాపు 27 ఏళ్లకు పైగా నాసాలో గడిపారు. భారత దేశానికి ఎనలేని పేరు తీసుకు వచ్చారు. అంతే కాదు మూడు స్టేషన్ మిషన్లలో 608 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. అంతే కాదు అరుదైన ఘనతను సాధించింది. అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. తను మూడు అంతరిక్షానికి సంబంధించిన స్టేషన్ మిషన్లలలో ఏకంగా 608 రోజులు గడిపింది. ఇది ఓ రికార్డ్. ఒక మహిళ అత్యధికంగా అంతరిక్షంలో నడిచిన వ్యక్తిగా చరిత్ర లిఖించింది.
ఈ సందర్బంగా న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో తన ప్రయాణం, అంతరిక్ష అనుభవాలపై ప్రసంగించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నెలల తరబడి చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములలో సునీతా విలియమ్స్ ఒకరు. తను పదవీ విరమణ పొందడం పట్ల ఒకింత బాధగా ఉన్నా ఏదో ఒక రోజు ఉద్యోగికి ఇది తప్పదన్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ చివరిలో ఆమె పదవీ విరమణ అమలులోకి వచ్చిందని అంతరిక్ష సంస్థ ప్రకటించింది. బోయింగ్ దురదృష్టకరమైన క్యాప్సూల్ టెస్ట్ ఫ్లైట్‌లో విలియమ్స్ సిబ్బంది సహచరుడు బుచ్ విల్మోర్ గత వేసవిలో నాసాను విడిచి పెట్టారు. ఈ జంట 2024లో అంతరిక్ష కేంద్రానికి పంపబడ్డారు. స్టార్ లైన్ మిషన్ కేవలం ఒక వారం మాత్రమే కొనసాగాలి. కానీ స్టార్‌లైనర్ సమస్య కారణంగా తొమ్మిది నెలలకు పైగా కొనసాగింది. చివరికి, వారు గత మార్చిలో స్పేస్‌ఎక్స్‌తో తిరిగి వచ్చారు.
















