Nara Lokesh : అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావం తీవ్రంగా ఉంది. ఏపీని వణికిస్తోంది. మొంథా తుపాను దుమ్ము రేపుతోంది. దీని దెబ్బకు పలు గ్రామాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తుపాను తీవ్రత కారణంగా ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. ఇక ఎప్పటికప్పుడు సహాయక చర్యలపై సమీక్ష చేపట్టారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). మొంథా తుఫాను అనంతరం కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు, సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆరా తీశారు. తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.
Minister Nara Lokesh Review
తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మొంథా తుపాను ప్రభావం 249 మండలాలపై పడిందని చెప్పారు. దీని కారణంగా 3 వేలకు పైగా గ్రామాలను వర్షాలు ముంచెత్తాయని తెలిపారు నారా లోకేష్. ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వందల చెట్లు నేలకూలాయని పేర్కొన్నారు. వాటిని తొలగించేందుకు 290 మంది సిబ్బంది పని చేస్తున్నారని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారిని బోట్లలో రక్షించేందుకు 60 మంది పని చేస్తున్నారని తెలిపారు. కాగా 3,175 మంది గర్భిణులు, బాలింతలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని స్పష్టం చేశారు నారా లోకేష్.
Also Read : Mohammad Azharuddin Sensational : మహమ్మద్ అజారుద్దీన్ బన్ గయా మినిష్టర్
















