Nara Lokesh : అమరావతి : మొంథా తుపాను తీవ్రత కొనసాగుతోంది. ఏపీని వణికిస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆర్టీజీఎస్ కేంద్రంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మంత్రి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). అర్థరాత్రి 12 గంటలకు ఆర్జీజీఎస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమీక్షలో పాల్గొన్నారు హోం మంత్రి అనిత, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఇతర ఉన్నతాధికారులు.పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేయనున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించిన అధికారులు. క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను సంప్రదించి తుఫాను తీవ్రత, సహాయక చర్యలపై వాకబు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
IT Nara Lokesh Comments
ఇదిలా ఉండగా మరో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు మొంథా తుపాను ప్రభావంపై తన కార్యాలయ అధికారుల ద్వారా క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకొంటున్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ల నుంచి పేషీ అధికారులు క్షేత్ర స్థాయి సమాచారం తీసుకొన్నారు. అర్థరాత్రి తుపాను తీరం దాటిన క్రమంలో తీవ్రమైన ఈదురు గాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై వివరాలు తెలుసు కున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడటంతో విద్యుత్ తీగలు పడటం, అదే విధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలన్నారు. ఆహార, వసతి కల్పించాలని స్పష్టం చేశారు. గాలులు తీవ్రంగా ఉండటం, కుండపోతగా వర్షం ఉన్నందున ప్రజలను ఇప్పటికిప్పుడు ఇళ్లకు పంపించడం శ్రేయస్కరం కాదన్నారు.
Also Read : DY CM Pawan Kalyan Interesting Comments : మొంథా తుపాను తీవ్రతపై పవన్ కళ్యాణ్ ఆరా















