Nara Lokesh : సిడ్నీ(ఆస్ట్రేలియా): విశాఖపట్నంలో నవంబర్ 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సిడ్నీలోని న్యూసౌత్ వేల్స్ పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ ఆండ్రూ ఎక్కువ సమయం నాతోపాటే ప్రయాణించి అనేక అంశాలను వివరించారని తెలిపారు. ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో మీకు మూడు కారణాలు చెబుతాను.
IT Minister Nara Lokesh Key Comments on AP Growth
మొదటిది ఏపీలో అనుభవం కలిగిన సమర్థ నాయకత్వం ఉంది. చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 75 ఏళ్ల యువకుడు. ఈ సారి గెలిచిన ఎమ్మెల్యేల్లో 50 శాతం మంది యువకులు ఉన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు ఉన్నారు. మేమంతా కసితో, పట్టుదలతో పనిచేస్తున్నాం. హైదరాబాద్ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు నారా లోకేష్. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ను పునర్ నిర్మించేందుకు ప్రజలు అవకాశం ఇచ్చారని అందుకే అహర్నిశలు శ్రమిస్తున్నామని చెప్పారు. రెండో కారణం స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. మీలో చాలామందికి గూగుల్ ప్రకటన తెలిసే ఉంటుంది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందన్నారు. ఇది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు.. గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్ తో పాటు సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా విశాఖకు రాబోతోందన్నారు.
Also Read : Conistable Murder Case Sensational : కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ఎన్ కౌంటర్


















