Nara Lokesh : విశాఖపట్నం : ఏపీని ఎలక్ట్రానిక్స్ , సెమి కండక్టర్స్ హబ్ గా మార్చడమే తమ కూటమి సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో అభివృద్ధి, అవకాశం, బలోపేతం (ఎలక్ట్రానిక్స్)పై పెట్టుబడిదారుల దృక్పథం (Investor’s perspective on Growth, Opportunity and Enablement (Electronics)) అనే అంశంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నారా లోకేష్. ఈ సందర్బంగా ప్రసంగిస్తూ కీలక సూచనలు చేశారు. యావత్ ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీతో అనుసంధానమై ఉందన్నారు. భవిష్యత్తులో సైతం ఐటీకి ఢోకా లేదన్నారు. తమ ప్రభుత్వం సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించు కుంటోందని చెప్పారు నారా లోకేష్.
IT Minister Nara Lokesh Key Comments
ఇదిలా ఉండగా క్లస్టర్ విధానంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా 17 ఎలక్ట్రానిక్ కంపెనీలతో రూ.27,909 కోట్ల మేర పెట్టుబడులకు జీవోలు, ఒప్పందాలు కుదుర్చు కోవడం జరిగిందని ప్రకటించారు నారా లోకేష్. ఏపీ రాష్ట్ర చరిత్రలో ఈ సీఐఐ సదస్సు మైలు రాయిగా నిలిచి పోతుందని అన్నారు. ఆయా పెట్టుబడుల ద్వారా 53,879 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు మంత్రి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పనే ధ్యేయంగా తాము ముందుకు వెళతామని తెలిపారు.
Also Read : Kirloskar Huge Investment in AP : కిర్లోస్కర్ కంపెనీ తయారీ ప్లాంట్ ఏపీలో


















