Nara Lokesh : ఢిల్లీ : ఏపీ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ వేదికగా రేపు, ఎల్లుండి 14, 15వ తేదీలలో రెండు రోజుల పాటు తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఐఐ సదస్సు 2025 నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలు, ప్రతినిధులు, ఇన్వెస్టర్స్, సీఈఓలు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు హాజరవుతున్నారని తెలిపారు. రూ. 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని తాము అంచనా వేశామని వెల్లడించారు నారా లోకేష్. శాంతను నారాయణ్ తో పాటు ఇతర పారిశ్రామికవేత్తలతో కలిశారు. ఇదిలా ఉండగా విశాఖ వేదికగా నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి నారా లోకేష్ మాట్లాడారు.
IT Minister Nara Lokesh Key Comments
ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చామని ప్రకటించారు. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నామని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు నారా లోకేష్. పెట్టుబడి దారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెప్పారు. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు నారా లోకేష్.
Also Read : AP CS Important Review : రాష్ట్రపతి, ప్రధాని ఏపీ పర్యటనపై సీఎస్ సమీక్ష


















