Nara Lokesh : అమరావతి – ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకున్నారు. కాళేశ్వరం ఎందుకు కట్టారంటూ ప్రశ్నించచారు. రెగ్యులేటరీ పర్మిషన్ ఉందా అంటూ నిలదీశారు. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను లిఫ్ట్ చేసి బనకచర్ల కడితే తప్పేంటి అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం కావాలనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులను మేం ఏనాడైనా అడ్డుకున్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP IT Minister Nara Lokesh Shocking Comments on Kaleswaram Project
నారా లోకేష్ (Nara Lokesh) మీడియాతో మాట్లాడారు. ఎక్కడున్నా తెలుగు ప్రజలు నెంబర్ వన్ గా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఏపీలో ఎమర్జెన్సీ వాతావరణం ఉంటే అసలు జగన్ బయటకు రాగలరా అని నిలదీశారు. ముఖ్యమంత్రికి కూడా ఇవ్వని భద్రత పులివెందుల ఎమ్మెల్యేకి ఇస్తున్నామన్నారు నారా లోకేష్. జగన్ పర్యటనలకు పర్మిషన్లు ఇస్తున్నామని, అంతకు మించి భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. పోలీసులను పెడితే ఎక్కువ మందిని పెట్టారని అంటారు..పెట్టక పోతే భద్రత ఇవ్వ లేదంటారంటూ ఎద్దేవా చేశారు.
సీఎంగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ హెలికాప్టర్ వేసుకుని తిరుగుతున్నారని, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను కావాలని, పనిగట్టుకుని నాశనం చేస్తున్నాడని ధ్వజమెత్తారు నారా లోకేష్. ఓవైపు పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు విదేశాలలో పర్యటన చేస్తుంటే కొందరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మురళీ కృష్ణ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఒక మెయిల్ పంపించారని అన్నారు. రాష్ట్రంలో రేపో మాపో ప్రభుత్వం మారిపోతుందని, ఒప్పందాలు చేసుకోవద్దని ఈ-మెయిల్ పంపించారంటూ ఆరోపించారు. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే పెద్దిరెడ్డికి చెందిన ఒక సంస్థలో ఉండే వ్యక్తి అని తేలిందన్నారు.
Also Read : MLC Nagababu Alarming : వీర మహిళలకు తోబుట్టువుల్లా తోడుంటాం
















