Nara Lokesh : సిడ్నీ (ఆస్ట్రేలియ) : అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందామని, మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలని, ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పిలుపునిచ్చారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ రూమ్ లో ఏపీ ఎన్ఆర్ టి ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ ఏ దేశానికి వెళ్లినా తెలుగు వాళ్లు కనిపిస్తారని అన్నారు. ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు లేని దేశం ఏదీ లేదన్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మనదే డామినేషన్. నేను ఎయిర్ పోర్ట్ దగ్గర నుంచి చూస్తున్నాను. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ ను ఇవ్వడం జరిగిందన్నారు. మీ జోషే వేరు. మీ మాస్ జాతర సూపర్. తెలుగుజాతికి గుర్తింపు తీసుకు వచ్చిన వ్యక్తి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత, సీఎం నందమూరి తారక రామారావు తెలుగు వాడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేశాడన్నారు.
IT Minister Nara Lokesh Australia Meet Up
ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ముఖ్యమంత్రి అయిన ఘనత తనకే దక్కిందన్నారు. ఆయన ఏ ఆశయాలతో తెలుగుదేశాన్ని స్థాపించారో అక్కడి నుంచి జన నాయకుడు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లారని, తెలుగువాడి సత్తాను ప్రపంచానికే పరిచయం చేశారన్నారు. 1995లో పెద్దఎత్తున సంస్కరణలు తీసుకువచ్చి ఐటీ విద్యను దగ్గర చేశారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారని ప్రశంసించారు. కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారని అన్నారు.. ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి జరిగినట్లా, ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల ఏం జరుగుతుందని ఆనాడు ఎగతాళి చేశారు. ఇప్పుడు వారి నోటి నుంచి మాట రావడం లేదన్నారు.
ఆయన వయస్సు 75 అయినా ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాడిలా పరిగెడతారన్నారు.. ఆయన మంత్రివర్గంలో చాలా మంది యువకులం ఉన్నాం. ఇప్పటికీ ఆయన స్పీడ్ ను మేం అందుకోలేక పోతున్నాం అన్నారు. ఆయన క్వాంటం కంప్యూటింగ్ అంటే నాకే అర్థం కాలేదు. నేను చాట్ జీపీటీలో వెతికాను. అందుకే ఆయనను విజనరీ అంటాం. ఇంకొకరిని ప్రిజనరీ అంటాం. అర్థం అయిందా రాజా! అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐ లు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నేను మాత్రం మిమ్మల్ని ఎంఆర్ఐ లు అంటాను. ఎంఆర్ఐ లు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అని చెప్పారు నారా లోకేష్.
Also Read : Jajula Srinivas Goud Shocking Comments : రాష్ట్ర బంద్ తో చరిత్ర సృష్టించాం : శ్రీనివాస్ గౌడ్


















