Nara Lokesh : అమరావతి : ఏపీ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నాయుడు అండ్ మోదీ అని వీరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ స్పీడులో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్ లో మంత్రి లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ సంధానకర్తగా వ్యవహరించారు. ఇందులో కీలక అంశాలపై చర్చించారు. ఏపీ ఏ రకంగా పెట్టుబడులకు అనువుగా ఉందని పేర్కొన్నారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అని స్పష్టం చేశారు నారా లోకేష్.
IT Minister Nara Lokesh Comments
రీన్యూ పవర్ రూ. 82,000 కోట్ల విలువైన ప్రధాన పెట్టుబడిని ప్రకటించారు. ఈ పెట్టుబడి సౌర ఇంగోట్ ,వేఫర్ తయారీ నుండి ప్రాజెక్ట్ అభివృద్ధి వరకు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్ ఉత్పత్తి వరకు మొత్తం పునరుత్పాదక ఇంధన విలువ గొలుసును కవర్ చేస్తుందని వెల్లడించారు మంత్రి నారా లోకేష్. పవర్ ఛైర్మన్ , CEO సుమంత్ సిన్హా , అతని బృందాన్ని స్వాగతించారు. ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ ఆశయాలకు ఈ చర్య ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని నారా లోకేష్ హైలైట్ చేశారు. హై-టెక్నాలజీ పునరుత్పాదక ఇంధన తయారీకి జాతీయ కేంద్రంగా మారడానికి రాష్ట్రం నిబద్ధతను ఈ భాగస్వామ్యం నొక్కి చెబుతుందని స్పష్టం చేశారు.
Also Read : CM Chandrababu Interesting Comments : పేదలకు ఇళ్లు కట్టించడం ప్రభుత్వ లక్ష్యం



















