Nara Lokesh : అమరావతి : రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ విద్యా రంగంలో కీలకమైన మార్పులు తీసుకు రానుందన్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు మెరుగైన విద్యను అందించేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉండవల్లి లోని తన నివాసంలో పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు నారా లోకేష్ (Nara Lokesh). అధునాతన విద్యా విధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78 మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వ తేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈనెల 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు నారా లోకేష్.
Minister Nara Lokesh Comments
గత ఏడాది మాదిరిగానే డిసెంబర్ 5వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ ను రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు . ఇందులో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని అధికారులకు చెప్పాను. డిఇఓ, ఎంఇఓలు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు . ఈ-ఆఫీసును బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లీప్ -1 గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఎఫ్ ఎల్ ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ)పై వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేయాలని పేర్కొన్నారు నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా కడప మోడల్ స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read : KTR Interesting Comments : ఆవిష్కరణలకే ఆదర్శంగా నిలిచిన టి హబ్
















