Nara Lokesh : ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. బుధవారం బ్రిస్బేన్ లోని జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టయినబుల్ ట్రోఫికల్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ విభాగం ప్రొఫెసర్ క్యాల్ జెంజర్ తో నారా లోకేష్ (Nara Lokesh) భేటీ అయ్యారు. ఉష్ణ మండల ఆక్వాసాగులో కీలకమైన బ్లాక్ టైగర్, బారాముండి రకాల రొయ్యల జన్యు పరమైన మెరుగుదల పరిశోధనలకు ప్రొఫెసర్ జెంజర్ నాయకత్వం వహించారు. ఆక్వా సాగు సామర్థ్యాన్ని పెంచే జన్యు సంబంధ సాధనాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో రొయ్యలు, చేపల పెంపకం సామర్థ్యాన్ని పెంచేందుకు సీఎస్ టీఎఫ్ఏ ద్వారా ఆక్వాకల్చర్ జెనెటిక్స్ నైపుణ్యాలను అందించాలని కోరారు.
IT Minister Nara Lokesh Meet
బ్లాక్ టైగర్ రొయ్యలతో భారత్ లో ప్రధానంగా ఉత్పత్తి చేసే ఆక్వా రకాల్లో వ్యాధి నిరోధకత, వృద్ధి రేటు కోసం జన్యు పరమైన మెరుగుదలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి వాటర్ రీ సైక్లింగ్, ఫీడ్ ఆప్టిమైజేషన్ ను ప్రోత్సహించాలని సూచించారు. ఆధునిక ఆక్వా సాగు పద్ధతులు, జన్యుపరమైన ఎంపిక, స్థిరమైన నిర్వహణ పద్ధతులపై ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల కోసం శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలని కోరారు. ఎంపిక చేసిన బ్రీడ్ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు మీరు అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్ ను మా ఆక్వా రైతులకు అందించాలని సూచించారు నారా లోకేష్. ఆక్వా సాగులో నష్టాలను తగ్గించి ఉత్పత్తిని స్థిరీకరించడానికి ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిందిగా మంత్రి విన్నవించారు.
Also Read : Pollution Control Board Warning Hyd : కాలుష్యపు కోరల్లో హైదరాబాద్ : పీసీబీ


















