నాని ‘ది ప్యార‌డైజ్’ మూవీ వ‌సూళ్ల‌లో రికార్డ్

నెగ‌టివ్ టాక్ వ‌చ్చినా ఆగ‌ని కాసుల వ‌ర్షం

hellotelugu-TheParadiseCollections

హైద‌రాబాద్ : యంగ్ అండ్ డైన‌మిక్ తెలంగాణ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన న్యాచుర‌ల్ నాని అందాల భామ‌లు క‌యాదు లోహ‌ర్, కీర్తి సురేష్, విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్ బాబు క‌లిసి న‌టించిన ది ప్యార‌డైజ్ మూవీ దుమ్ము రేపుతోంది. విడుద‌లైన ఫ‌స్ట్ షో నుండే దీనిపై మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. ఓ వైపు నెగ‌టివ్ టాక్ ను దాటుకుని ఇప్పుడు పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. బాక్సులు బ‌ద్ద‌లు కొడుతూ కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రికార్డ్ బ్రేక్ చేస్తోంది. మొత్తంగా నాని సినీ కెరీర్ లో ఈ మూవీనే అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.

ది ప్యార‌డైజ్ మూవీ థియేటర్లలోకి వచ్చి ఐదు రోజులు గడిచినా బాక్సాఫీస్ వద్ద నిలకడగా కొనసాగుతోంది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఈ చిత్రం తన మొదటి సోమవారం కూడా ప్రోత్సాహకరమైన వసూళ్లను నమోదు చేస్తూ తన జోరును కొనసాగించ గలిగింది. ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం సుమారు ₹10 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ప్రపంచ వ్యాప్తంగా తన మొత్తం వసూళ్లను ₹165 కోట్ల మార్కుకు చేరువ చేసింది. ప్రారంభ వారాంతంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, నిన్న‌టి ప్రదర్శన ఈ చిత్రానికి ఒక ముఖ్యమైన సూచికగా నిలిచింది. అయినప్పటికీ ‘ది ప్యారడైజ్’ తన మొదటి పనిదినం నాడు కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది.

ఈ చిత్రం టికెట్ అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. గత 24 గంటల్లో బుక్ మైషో , డిస్ట్రిక్ట్ ద్వారా కలిపి 1.13 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. వారాంతం తర్వాత ప్రేక్షకుల ఆసక్తి పెద్దగా తగ్గలేదని ఇది సూచిస్తోంది.

Exit mobile version