హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన అక్కినేని నాగార్జున కీ రోల్ పోషించిన చిత్రం గీతాంజలి . ఇది కొన్నేళ్ల కిందట సంచలనం సృష్టించింది. అద్భుతమైన ప్రేమను ఆవిష్కరించేలా చేసింది. ఇందులో పాత్రలు పోషించిన వారంతా అద్భుతంగా నటించారు. కన్నీళ్లు తెప్పించేలా చేశారు. ఈ సినిమా భారీ సక్సెస్ కావడానికి మరో కారణం సంగీతపు రారాజు ఇళయరాజా అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం. ఇప్పటికీ ఎప్పటికీ పది కాలాల పాటు నిలిచి పోయేలా సినిమాను తీశారు మణిరత్నం. ఇక నాగార్జున కెరీర్ లో ఇది మరిచి పోలేని మూవీగా నిలిచి పోయింది. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే గతంలో విడుదలై భారీ హిట్ సాధించిన సినిమాలను తిరిగి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు గీతాంజలి కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
శుక్రవారం చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు నాగార్జున గీతాంజలి రీ రిలోజ్ డేట్ గురించి అప్ డేట్ ఇచ్చింది. సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించిన గిరజ ఇప్పటికీ గుర్తుండి పోతుంది. భావోద్వేగ లోతుతో ఆకట్టుకునే కథ కారణంగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం అవార్డును , ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌తో సహా ఆరు రాష్ట్ర నంది అవార్డులను అందుకుంది. అంతేకాదు, ఇది థియేటర్లలో 100 రోజులకు పైగా ప్రదర్శించబడి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది . ‘గీతాంజలి’ చిత్ర నిర్మాతలు కూడా ఈ సినిమాను నవంబర్ 13న థియేటర్లలో తిరిగి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పంచుకుని సినీ ప్రేమికులను , అక్కినేని అభిమానులను ఆనంద పరిచారు. మ్యాజిక్‌ను మరోసారి అనుభూతి చెందండి. కల్ట్ క్లాసిక్ గీతాంజలి మీ కోసం , మీ ముందుకు రాబోతోంది అని నిర్మాతలు ప్రకటించారు.
