Nagarjuna University : గుంటూరు : ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎం.ఏ. పబ్లిక్ పాలసీ (బి.ఏ.+ఎం.ఏ.) కోర్సు కోసం దరఖాస్తుల సమర్పణకు గడువును 2025–26 విద్యాసంవత్సరానికి పొడిగించారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం (Nagarjuna University) ప్రవేశాల డైరెక్టర్ డా. పి. బ్రహ్మాజీ రావు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
Nagarjuna University Key Updates
తక్షశిల IAS అకాడమీ సమన్వయంతో అమలు అవుతున్న ఈ వినూత్న కార్యక్రమం, ఇంటర్మీడియేట్ (+2) అనంతరం సివిల్ సర్వీసెస్ (యు పి ఎస్ సి ), ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని అనుకుంటున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులు పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్, సంబంధిత రంగాలలో గట్టి విద్యా పునాదిని పొందుతారని తెలిపారు. సమ కాలంలోనే పోటీ పరీక్షలకు కూడా సిద్ధమయ్యే అవకాశం పొందుతారని పేర్కొన్నారు.
పునః సవరించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల సమర్పణకు లేట్ ఫీజు లేకుండా గడువు సెప్టెంబర్ 6వ తేదీ వరకు, రూ.1,000 లేట్ ఫీజుతో సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. ప్రవేశ పరీక్ష 10వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు .
ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం 9030088685 నంబర్లలో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు ప్రవేశాల డైరెక్టర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జున నగర్, గుంటూరు – 522510 ను సంప్రదించవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయం ఫోన్లు 0863-2346171 / 0863-2346138, వెబ్‌సైట్ www.nagarjunauniversity.ac.in, ఇమెయిల్ diranuadmissions@gmail.com ద్వారా కూడా తెలుసు కోవచ్చన్నారు.
Also Read : Ram Mohan Naidu Interesting Comments : భవిష్యత్ పెట్టుబడి కేంద్రంగా అమరావతి


















