Popular Actor Nagarjuna : అలాంటి సినిమా చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి

నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున విలేకరులతో మాట్లాడారు...

Hello Telugu - Popular Actor Nagarjuna

Hello Telugu - Popular Actor Nagarjuna

Nagarjuna : కుబేర’ చిత్ర కథ, ఇందులోని క్యారెక్టర్లు, స్ర్కీన్‌ప్లే అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటి సినిమా చేయడానికి గట్స్‌ కావాలి. ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే సినిమా ఇది’ అని అన్నారు హీరో అక్కినేని నాగార్జున. ఆయన, ధనుష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర (Kuberaa)’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున (Nagarjuna) విలేకరులతో మాట్లాడారు.

Nagarjuna Key Comments

మంచి కథ రావాలంటే స్టార్స్‌ కలసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్నగారు, ఎన్టీఆర్‌ గారు, కృష్ణగారు, శోభన్‌బాబుగారు.. ఇలా అందరూ కలసి ఎన్నో సినిమాలు చేశారు.

శేఖర్‌ కమ్ములతో పనిచేయాలని ఎప్పటినుంచో ఉంది. ‘ఆనంద్‌’ దగ్గర నుంచి ఆయన సినిమాలు మనందరికీ తెలుసు. ఆయన సినిమాలంటే నాకు బాగా ఇష్టం. ఆ కథల్లో సామాజిక స్పృహ ఉంటుంది. వాణిజ్య హంగులతో పాటు అద్భుతమైన పాటలూ ఉంటాయి.

‘కుబేర’ (Kuberaa) చిత్రంలో యూనిక్‌ పాయింట్‌ ఉంది. నేటి సమాజానికి ఆ పాయింట్‌ చాలా రిలెవెంట్‌.

శ్రీమంతుడు, మధ్యతరగతి వాడు, బిచ్చగాడు… ఇలా మూడు సొసైటీల మధ్య సంఘర్షణే ఈ చిత్ర కథ.

ఈ సినిమాలో నాది మధ్యతరగతి మనిషి క్యారెక్టర్‌. సీబీఐ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్‌ ఉంటుంది. శేఖర్‌ చాలా అద్భుతంగా రాశారు. నా బాడీ లాంగ్వేజ్‌, మాట తీరు, రియాక్షన్‌.. అన్నీ కొత్తగా శేఖర్‌ కమ్ముల స్టయిల్‌లో ఉంటాయి. సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి.

అవన్నీ కూడా మన నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ధనుష్‌ తన పాత్రలో ఒదిగిపోయి చేశారు. రష్మిక చాలా చక్కగా నటించారు. సినిమా చూసి నువ్వే స్టార్‌ అని ఆమెతో చెప్పాను. దేవిశ్రీ ప్రసాద్‌ మంచి సంగీతం అందించారు. ఇందులోని పాటలన్నీ సందర్భోచితంగా ఉంటాయి.

పాన్‌ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని చిత్రాలు పాన్‌ ఇండియా కాలేవు. ‘శివ’ సినిమా 4కె వర్క్‌ పూర్తయింది. ఒక రీల్‌ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ‘కూలీ’లో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. మొదటి సారి ఇలాంటి క్యారెక్టర్‌ చేస్తున్నాను. లోకేశ్‌ కనగరాజ్‌ కంప్లీట్‌ న్యూ ఏజ్‌ డైరెక్టర్‌. నా 100వ సినిమా ప్లానింగ్‌ చేస్తున్నాం. వర్కింగ్‌ టైటిల్‌ ‘కింగ్‌ 100’ అని పెట్టాం.

ఆంధ్రప్రదేశ్‌లో ‘కుబేర’ చిత్రానికి టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్లీప్లెక్స్‌, సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో రూ.75 రూపాయలు (జీఎస్టీ అదనం) పెంచుకునే అవకాశం ఇచ్చింది. సినిమా విడుదలైన 10 రోజుల వరకూ పెరిగిన టికెట్‌ ధరలు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు, తెలంగాణలో మాత్రం టికెట్‌ రేట్లు యథాతథంగా ఉంటాయి. ధరల పెంపు కోసం చిత్రబృందం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం.

Also Read : Hero Pawan-Ustaad Bhagat Singh : వరుస షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్న పవర్ స్టార్

Exit mobile version