Shiva : హైదరాబాద్ : ప్రముఖ నటుడు, బిగ్ బాస్ 9 హోస్ట్ అక్కినేని నాగార్జున సంచలన ప్రకటన చేశారు. తాను నటించిన శివ చిత్రం తిరిగి నవంబర్ 14 రీ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అధికారికంగా సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఒక మూస ధోరణితో సాగుతున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నట్టుండి సెన్సేషన్ క్రియేట్ చేసింది శివ (Shiva). దీనికి నూతన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించాడు. అప్పట్లో దుమ్ము రేపింది. యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఆర్జీవీని గ్రేట్ డైరెక్టర్ గా మార్చేలా చేసింది. తను ఎన్నో సినిమాలు తీశాడు. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లాడు. అక్కడ కూడా తనకు ఎదురే లేదని చాటాడు. తను తీసిన ప్రతి మూవీ ఓ సంచలనం. మాఫియా, డాన్స్, గ్యాంగ్ స్టర్స్ పై తను తీసిన ప్రతి సినిమా కాసుల వర్షం కురిపించింది. కొత్తగా నటీ నటులను, సాంకేతిక నిపుణులను తను పరిచయం చేశాడు రామ్ గోపాల్ వర్మ.
Nagarjuna Shiva Movie Re-Release
ఇక శివ సినిమాకు వస్తే కాలేజీలో రెండు గ్యాంగుల మధ్య జరిగే ఘర్షణను ఇందులో ప్రత్యేకంగా చిత్రీకరించాడు. హీరో హీరోయిన్లుగా నాగార్జున, అమల నటించగా విలన్ గా రఘువరన్ నటించాడు. తను ఇప్పుడు లేడు. సినిమా కోసం పని చేసిన వారిలో ఇళయరాజా, రామ్ గోపాల్ వర్మ, నాగార్జున, అమల , తనికెళ్ల భరణి , చక్రి ఉన్నారు. శివ సినిమాను 1989లో విడుదల చేశారు. టాలీవుడ్ లో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న మూవీగా ఇప్పటికీ నిలిచి పోయింది. ఈ క్రెడిట్ అంతా రామ్ గోపాల్ వర్మదే. శనివారం, తన తండ్రి, దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతిని కూడా గుర్తు చేసుకుంటూ శివను తిరిగి విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు నాగ్.
Also Read : Deepika Padukone Shocking Comments on Kalki 2 : కల్కి సీక్వెల్ నిష్క్రమణపై దీపికా కామెంట్స్


















