Nadendla Manohar : అమరావతి – 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి విజయాన్ని కూటమికి అందించారో… అటువంటి విజయాన్నే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు అందిస్తారని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాలనూ అణగదొక్కారని, వాటన్నింటిని గుర్తుకు తెచ్చుకొని ఓటు వేయాలని ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. సోమవారం రైల్వేకోడూరు మార్కెట్ యార్డు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Nadendla Manohar Key Comments
మనోహర్ (Nadendla Manohar) మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్నో అన్యాయాలకీ, అవమానాలకు గురయ్యాం. గతంలో ఈ ప్రాంతంలో సభ నిర్వహిస్తే ఎన్నో ఆంక్షలు విధించారు. వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలపై ప్రశ్నించినందుకు సురేష్ అనే జన సైనికుడి చీనీ తోటను ధ్వంసం చేశారు. మరికొందరిపై అక్రమ కేసులు బనాయించి నిర్భందించారని వాపోయారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదు. ఆయన హయాంలో ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 113 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. సొంత నియోజకవర్గమైన పులివెందులలో 24 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని అన్నారు. మన ప్రాంతం వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే మనకు అండగా ఉంటాడని నిండు మనసుతో ఆశీర్వదిస్తే… ఆయన కౌలు రైతుల ఉసురు తీశారు. కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు సిద్ధవటంలో కార్యక్రమం నిర్వహిస్తే… ఆ కార్యక్రమానికి కౌలు రైతుల కుటుంబాలను రానీయకుండా బెదిరింపులకు దిగాడంటూ మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ బెంగళూరు నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఏదో ఒక సమస్య పేరు చెప్పి హెలికాఫ్టర్ లో వచ్చి నానా యాగీ చేసి వెళ్లిపోవడం అలవాటు చేసుకున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డు దగ్గర ఇలాంటి హడావుడే చేశారు. వాళ్ల ఫోటోలు, వీడియోల కోసం… రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రోడ్లపై పారబోసి వాహనాలతో తొక్కించారు. నిజానికి ఆ ప్రాంతంలో మామిడి పండ్లు కొనుగోలు చేసే ముఠా వాళ్లదే. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఏనాడు కూడా మామిడి రైతుల గురించి పట్టించుకోని జగన్ .. ఇప్పుడు కొత్తగా వారిపై ప్రేమ ఒలకబోశారంటూమండిపడ్డారు.
Also Read : RBI Sensational Decision : రూపీ లో చెల్లింపుల దిశగా రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం

















