Nadendla Manohar : అమరావతి : ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్ధతు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar). తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు, దొమ్మేరులో పర్యటించారు. ధాన్యం సేకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేరుగా రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం నాణ్యతను, తూకం వేసే విధానాన్ని, గోనె సంచుల లభ్యతను స్వయంగా తనిఖీ చేశారు. వాతావరణంలో మార్పులు, అల్పపీడన హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్షం వల్ల పంట నష్ట పోకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామని చెప్పారు నాదెండ్ల మనోహర్. అలాగే ధాన్యం సేకరణ వేగవంతం చేయడానికి ముందస్తుగానే భారీ సంఖ్యలో కూలీలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
Minister Nadendla Manohar Key Comments
తేమ శాతం 17 దాటినా సరే, రైతులను ఇబ్బంది పెట్టకుండా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్ల యజమానులకు సూచించడం జరిగిందన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే, ఎటువంటి జాప్యం లేకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రైతులను పట్టించు కోలేదని, ఎంఎస్పీ కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక సీన్ మారిందన్నారు. అన్ని పంటలను సాగు చేసే రైతాంగానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్.
Also Read : Harish Rao Shocking Comments : రాష్ట్రంలోని బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారు
















