Thalapathy Vijay : తమిళనాడు – టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు దళపతి విజయ్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురించి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డీఎంకే పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు. ఇదిలా ఉండగా మధురై వేదికగా టీవీకే పార్టీ సమావేశం జరిగింది. ఈ సభకు 4 లక్షలకు పైగా జనం హాజరయ్యారు. వారిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు . డీఎంకేతో పాటు భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. సైద్దాంతిక పరంగా బీజేపీతో పోటీ ఉంటుందన్నాడు. అంతే కాదు సీఎం ఎంకే స్టాలిన్ గురించి అంకుల్ అంటూ సంబోదించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం. దళపతి విజయ్ (Thalapathy Vijay) ను ఏకి పారేశారు.
Thalapathy Vijay Shocking Commenrs
పెద్ద వారి పట్ల ఎలా మాట్లాడాలో తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి. సినిమా, రాజకీయాలు ఒకేలా ఉండవన్నారు. ఇది అతని పరిపక్వత లేకపోవడాన్ని చూపిస్తుందన్నారు. తన రాజకీయ లక్ష్యానికి ఉపయోగ పడుతుందని భావించి అతను డిఎంకె నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపించారు. తను తెలుసు కోవాల్సింది చాలా ఉందన్నారు సినిమాలు వేరు, పాలిటిక్స్ వేరు అని గుర్తిస్తే మేలు జరుగుతుందన్నారు. ఇదే సమయంలో తమ నాయకుడిపై చేసిన ఆరోపణలు అవాస్తవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సభలకు జనం వస్తారని , అయినంత మాత్రాన ఓట్లు వేస్తారని అనుకోవడం భ్రమ తప్ప మరోటి కాదన్నారు.
Also Read : Hero Chiranjeevi New Looks : మన శంకర వర ప్రసాద్ లుక్ అదుర్స్
















