YV Subbareddy : అమరావతి : ఏపీ కూటమి సర్కార్ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల పక్షాన పోరాడి యూరియా కష్టాలు తీర్చటానికి కృషి చేస్తామన్నారు. తమ నాయకులు, కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై తమ పార్టీ ఫోకస్ పెట్టందన్నారు. ప్రజల తరున గొంతుకగా ఉంటామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు రాచరిక పాలన కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరూ అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు సుబ్బారెడ్డి.
YV Subbareddy Slams AP Govt
వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించు కోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
డయేరియా బాధితులను కూడా అలాగే వదిలేసిందన్నారు. ఎవరి ఎన్ని తప్పులు చేసినా మీడియాని అడ్డుపెట్టుకొని వాస్తవాలు కప్పి పెడుతోందని ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి దూర దృష్టితో 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుడితే ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తోందంటూ మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి. విద్యా వైద్యం పేదలకు అందుబాటులో ఉంచాలని జగన్ ఆలోచించి, ఆచరణలో చేసి చూపించాడన్నారు. కానీ చంద్రబాబు నాయుడు తమ వారి కోసం ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. కల్తీ మద్యం చేసింది కూటమి ప్రభుత్వమేనని, కానీ తమపై అకారణంగా నిందలు మోపడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Also Read : CM Chandrababu Important Update on Modi : నరేంద్ర మోదీ పాలనకు 25 ఏళ్లు..బాబు కంగ్రాట్స్
















