అమ‌రావ‌తికి రాష్ట్ర‌ప‌తి ఆమోదం ఎంపీ సంతోషం

మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి మాట్లాడే హ‌క్కు లేదు

hellotelugu-KesineniChinni

విజ‌య‌వాడ : అమ‌రావ‌తి శాశ్వ‌త రాజ‌ధానిగా ఇవాల్టి నుంచి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము సంత‌కం చేయ‌డంతో అమ‌లులోకి వ‌చ్చింద‌ని ఈ సంద‌ర్బంగా సంతోషం వ్య‌క్తం చేశారు ఎంపీ కేశినేని నాని అలియాస్ చిన్ని. ఆయ‌న మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. అమరావతి ఎపి రాజధాని గా రాజ ముద్ర పడిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. చట్ట సభల్లో అమోదం పొందింద‌ని, గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి రాజధాని కావాలని అమరావతిని నిర్ణయించారన్నారు. రాష్ట్రం నడిబొడ్టున మంచిది అని ఆనాటి ప్రతిపక్ష నేతను ఒప్పించారన్నారు.

అసెంబ్లీ వేదికగా ముప్పై వేల ఎకరాలు కావాలని జగన్ చెప్పారన్నారు. రైతులు చంద్రబాబు పై నమ్మకం తో 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో ఇక్కడే ఇల్లు క‌ట్టుకున్నాన‌ని, రాజ‌ధానిని అభివృద్ది చేస్తానంటూ న‌మ్మించాడ‌ని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అని ఇస్తే మూడు రాజ‌ధానుల పేరుతో ఏపీకి రాజ‌ధాని అంటూ లేకుండా చేశాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు ఎంపీ కేశినేని నాని. 2019-24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగ ఫలమే నేటి అమరావతి అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిని ఆర్దిక శక్తి గా మార్చేలా ఎంతో తపన పడ్డారని చెప్పారు. చివ‌ర‌కు జ‌గ‌న్ కుట్ర‌లు, వైసీపీ ప‌న్నాగాలు ప‌ని చేయ‌లేద‌న్నారు ఎంపీ.

Exit mobile version