MP Purandeswari : ఢిల్లీ – భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలి ఎంపిక చేయడంపై. ఈ మేరకు పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించింది. నిన్నటి దాకా ఏపీ బీజపీ చీఫ్ గా ఉన్న ఎంపీ పురందేశ్వరితో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ మహిళా మోర్చా చీప్ వానతి శ్రీనివాసన్ లను పరిశీలిస్తోంది. ఇటివలే ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అధ్యక్షులను నియమించింది బీజేపీ. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యక్షులుగా రామచందర్‌రావు, మాధవ్ లకు బాధ్యతలు అప్పగించింది.
MP Purandeswari in BJP Women President List
ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌తో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా దక్షిణాదిలో మహిళా ఓటర్లను ప్రభావితం చేసేందుకు కీలకమైన నాయకురాలిని నియమించాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అధ్యక్ష పదవి రేసులో కేంద్ర మంత్రి ముందంజలో ఉండగా పురంధేశ్వరి (MP Purandeswari), డీకే అరుణ భరత సింహా రెడ్డి పేర్లు కూడా పరిశీలనకు వచ్చే ఛాన్స్ ఉంది.
మరో వైపు నిర్మలా సీతారామన్ స్వస్థలం తమిళనాడు. తన భర్తది ఆంధ్ర. ఇక ఆమె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా రికార్డు సృష్టించారు. మోదీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే సమయంలో పురందేశ్వరి హయాంలో బీజేపీ ఏపీలో పవర్ లోకి వచ్చింది. ఇది ఒక రకంగా ఆమెకు ప్లస్ పాయింట్ గా మారింది. ఓ వైపు కేంద్ర పదవిలో ఉండడంతో మరింత బాధ్యతలు ఉంటాయి. అదే పురందేశ్వరికి అయితే పార్టీ కోసం ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం అధ్యక్ష పదవి రేసులో ఇద్దరి మధ్యే అసలైన పోటీ నెలకొంది. మరి ఎవరిని హైకమాండ్ ఓకే చేస్తుందనేది కమల నాథుల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read : Poonam Kaur Shocking Comments : పవన్..త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ ఫైర్


















