MP Mithun Reddy : అమరావతి – ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలైన ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సిట్టింగ్ ఎఎంపీనని, ఎక్కడికీ పారి పోవడం లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని ప్రత్యేక ACB (అవినీతి నిరోధక బ్యూరో) కోర్టు ముందు హాజరయ్యారు. తనపై నమోదైన మద్యం కుంభకోణం కేసు రాజకీయంగా ప్రేరేపించ బడిందని, పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. తాను మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యానని ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు ఎంపీ.
MP Mithun Reddy Key Comments
తాను దేశం విడిచి పారిపోయే ఉద్దేశ్యం లేదని రెడ్డి కోర్టుకు హామీ ఇచ్చారు. గత వైసీపీ పాలనలో జరిగిన రూ. 3,200 కోట్ల మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎంపీ నిందితుడిగా నంబర్ 4 (A4)గా పేర్కొంది. జూలై 20న విజయవాడలోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) కార్యాలయంలో ఆయన SIT ముందు విచారణకు హాజరయ్యారు. ఏడు గంటలకు పైగా విచారించిన తర్వాత, తనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు కస్టడీకి అప్పగించింది.
ఇదిలా ఉండగా రిమాండ్ కాలం ముగుస్తుండడంతో సిటి పొడిగింపు కోరుతూ కోర్టుకు అభ్యర్థనను సమర్పించింది. విచారణ సందర్భంగా కూటమి సర్కార్ రాజకీయ ప్రతీకారంతో రూపొందించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా ఎంపీకి సంబంధించి సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండూ గతంలో అతని ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించాయి. కాగా త్వరలో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సిట్ తెలిపారు.
Also Read : Vice President Election Important Update : ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
















