MP Eatala Rajender : సికింద్రాబాద్ : బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ (MP Eatala Rajender) నిప్పులు చెరిగారు. బీజే జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీసీ బంద్ లో పాల్గొన్నారు ఎంపీ. ఈ సందర్బంగా సికింద్రాబాద్ లోని జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొని ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారని, అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రం ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని అన్నారు. పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయన్నారు. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9 వ షెడ్యూల్ లో చేర్చారని చెప్పారు.
MP Eatala Rajender Slams Congress Govt
తెలంగాణలో కూడా కేసీఆర్ ఒక సారి సర్వే చేశారని, బీసీ కమీషన్ వేశారని, ఎన్ని వేసినా నిజాయితీ లేదని, కాబట్టి అమలు కాలేదన్నారు. ఆనాటి సర్కార్ తో పాటు ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమీషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదన్నారు ఎంపీ ఈటల రాజేందర్. లెక్కలు తీశారు.. కానీ అవన్నీ తప్పుల తడక అని మండిపడ్డారు. 52 శాంతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. తాను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుండి తప్పుకుంటానని , తాను ఇవాళ మాట్లాడిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అని ప్రకటించారు. బీసీలు మేమెంతో మాకంత కావాలి. యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నామన్నారు.
Also Read : Today Gold Price : ఆల్ టైమ్ హైకి చేరిన పసిడి ధరలు















