Kandula Durgesh : రాజస్థాన్ : ఏపీ రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కేంద్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రుల రెండో రోజు సమావేశంలో పాల్గొన్నారు దుర్గేష్. రాష్ట్ర పర్యాటక ప్రతిపాదనలను సమర్పించారు.
Minister Kandula Durgesh Comments
ఈ సందర్భంగా తిరుపతిలో కలినరీ ఇన్‌స్టిట్యూట్, అమరావతిలో పర్యాటక భవన్, రాజ మహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్థాపించాల్సిందిగా కేంద్ర మంత్రిని అభ్యర్థించడం జరిగిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఈ విషయమై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు, త్వరలోనే రాష్ట్రానికి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయిస్తానని హామీ ఇచ్చారన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోనే నిలిచి పోయిన పర్యాటక భవన్‌ను తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కోరగా కేంద్ర మంత్రి ఓకే చెప్పారన్నారు కందుల దుర్గేష్. ఈ సందర్బంగా కేంద్ర పర్యాటక మంత్రి ఏపీ పర్యాటక విధానం అత్యుత్తమంగా ఉందని ప్రశంసించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
ఈ సమావేశం అనంతరం ఏపీటిడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి కాటతో కలిసి కేంద్ర మంత్రిని మర్యాద పూర్వకంగా కలుసుకొని రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి సహకరించాలని అభ్యర్థించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో ఏపీ పర్యాటక రంగం కొత్త దిశలో ముందుకు సాగుతోందన్నారు కందుల దుర్గేష్.
Also Read : MLC Nagababu Important Update : ఏటికొప్పాక బొమ్మలకు సాంకేతిక జత చేస్తాం
















