Azharuddin : హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ (Azharuddin) తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అజహరుద్దీన్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు హాజరయ్యారు. అజహరుద్దీన్ చేరికతో మంత్రివర్గం 16కి చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి 2 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు మైనార్టీల నుంచి ఏ ఒక్కరికీ ప్రాతినిధ్యం లభించలేదు. ఈ సమయంలో షబ్బీర్ అలీకి ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో అజహరుద్దీన్ కు అవకాశం లభించింది.
Azharuddin Oath As a Minister
ఇక మహమ్మద్ అజహరుద్దీన్ ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యంత విజయవంతమైన, జనాదరణ పొందిన ఆటగాడిగా గుర్తింపు పొందారు. తను వన్డే, టెస్టు ఫార్మాట్ లలో ఇండియాకు కెప్టెన్ గా పలు విజయాలు అందించాడు. కానీ అనూహ్యంగా తను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆపై తనపై బీసీసీఐ నిషేధం విధించింది. దీనిని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అది అబద్దమంటూ కొట్టి వేసింది. ఆ తర్వాత తనపై విధించిన నిషేధాన్ని తొలగించింది బీసీసీఐ. ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. అంతకు ముందు తను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఎంపీగా యూపీ నుంచి గెలుపొందాడు. మరోసారి టికెట్ ఇస్తే ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. తన కోరిక మంత్రి కావడం. అంతే కాదు అజహరుద్దీన్ కు పార్టీ హైకమాండ్ వద్ద మంచి సంబంధాలు ఉన్నాయి.
Also Read : YS Jagan Fired on CM Chandrababu : సర్కార్ నిర్వాకం రైతులు ఆగమాగం
