Mohammad Azharuddin : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin) సంచలన కామెంట్స్ చేశారు. అవకాశం వస్తే తాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు.
Mohammad Azharuddin Shocking Comments
అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అరెస్ట్ హెచ్‌సీఏకు అవమానం అన్నారు. అదనపు టికెట్లకు ఓప్పుకోకపోతే వేధించడం దారుణమన్నారు. తక్షణమే అసోసియేషన్ రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఆయన అధ్యక్షుడిగా పని చేశాడు. తనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే హెచ్ సీ ఏ అంటేనే బీసీసీఐ భయపడే పరిస్థితి నెలకొంది. మరో వైపు తాజాగా హెచ్ సీ ఏ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వం సిట్ కు ఆదేశించింది. సీఐడీ రంగంలోకి దిగింది. చారు సిన్హా తీగ లాగితే డొంకంతా కదిలింది.
చివరకు అధ్యక్షుడిగా ఉన్న జగన్ మోహన్ రావుతో పాటు క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించి మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. తను దొంగ పత్రాలు సృష్టించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా జగన్ మోహన్ రావు ఎన్నికైనట్లు తేలింది. దీంతో ఆయనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సన్నిహిత సంబంధాల గురించి కూడా చర్చకు వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Saina Nehwal Divorce Shocking : పారుపల్లి కశ్యప్ తో విడి పోతున్నా – సైనా నెహ్వాల్



















