Modi : ఢిల్లీ : భారత దేశానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న ఖలిస్తానీ గ్రూపులకు కెనడా నుంచి నిధులు వస్తున్నాయని తేలి పోయింది. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది మోదీ (Modi) ఎన్డీయే సర్కార్. ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించింది కెనడా ఆర్థిక నిఘా సంస్‌థ (ఫిన్ ట్రాక్ ) . హిజ్బుల్లాను కెనడా నుండి నిధులు పొందుతున్న రెండవ అత్యంత తరచుగా గుర్తించబడిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాద గ్రూపులతో సహా అనేక ఉగ్రవాద సంస్థలు, దేశంలో రాజకీయంగా ప్రేరేపించబడిన హింసకు సంబంధించిన కార్యకలాపాల కోసం కెనడా నుండి ఉద్భవించే ఆర్థిక సహాయాన్ని పొందుతూనే ఉన్నాయని తేలింది. ఈ విషయాన్ని కెనడియన్ ఆర్థిక శాఖ విడుదల చేసిన కొత్త నివేదిక బట్ట బయలు చేసింది.
PM Modi Strong Focus on..
2025 మనీలాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్‌ల అంచనా వేసింది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ , సిక్కు యూత్ ఫెడరేషన్‌తో సహా కొన్ని ఖలిస్తానీ గ్రూపులను రాజకీయంగా ప్రేరేపించబడిన హింసాత్మక తీవ్రవాదం వర్గంలోకి చేర్చింది సదరు సంస్థ. లాభాపేక్షలేని ,స్వచ్ఛంద రంగాలలోని నిధుల నెట్‌వర్క్‌లను వారి లక్ష్యాలకు మద్దతుగా ఉపయోగించు కుంటున్నారని అనుమానిస్తోంది కెనడా ఆర్థిక నిఘా సంస్థ. నడియన్ క్రిమినల్ కోడ్ కింద ఉగ్రవాద సంస్థలుగా వీటిని గుర్తించింది. ఇందులో హమాస్ , హిజ్బుల్లా కూడా ఉన్నాయి.
Also Read : MP Midhun Reddy-ACB Court Approved : ఎంపీ మిధున్ రెడ్డికి బెయిల్ మంజూరు















