Brics : ఢిల్లీ – బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది భారత దేశం. ఈ సందర్బంగా ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. పనిలో పనిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మోదీ (PM Modi) ఆహ్వానించారు . సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ సంవత్సరం జూలైలో రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ గ్రూపుల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. వచ్చే ఏడాది బ్రిక్స్‌కు కొత్త రూపం ఇవ్వడానికి భారతదేశం ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బ్రిక్స్ ను 11 దేశాలు ఏర్పాటు చేశాయి. వాటిలో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ ఉన్నాయి.
Brics Summit 2026 Updates
ఇది గ్లోబల్ సౌత్ దేశాలకు రాజకీయ, దౌత్య సమన్వయ వేదికగా పనిచేస్తుంది, విస్తృత శ్రేణి రంగాలలో సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. కాగా 2026 లో భారతదేశం నిర్వహించనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇదే సమయంలో తనను ఆహ్వానించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు చైనా చీఫ్. అంతే కాకుండా భారతదేశ బ్రిక్స్ అధ్యక్ష పదవికి చైనా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాగా ప్రస్తుత అధ్యక్షుడు బ్రెజిల్ నుండి బ్రిక్స్ నాయకత్వాన్ని స్వీకరించడానికి భారతదేశం సిద్ధమవుతోంది. షాంఘై సహకార సంస్థ అధ్యక్ష పదవికి , టియాంజిన్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి చైనాకు ప్రధాని మోదీ మద్దతు తెలిపారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also Read : Telangana Shocking Instructions : వినాయక నిమిజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు

















