MLC Teenmar Mallanna Shocking Comments : చంపాల‌ని చూస్తే చూస్తూ ఊరుకుంటామా

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న

Hello Telugu - Teenmar Mallanna Shocking Comments

Teenmar Mallanna : హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి సంస్థ‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆదివారం హైద‌రాబాద్ లోని తీన్మార్ మ‌ల్ల‌న్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడికి పాల్ప‌డ్డారు. ఈ స‌మ‌యంలో ఆఫీసులోనే ఉన్న మ‌ల్ల‌న్న‌ను టార్గెట్ చేస్తూ దాడి చేసేందుకు య‌త్నించారు. భౌతికంగా దాడి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా ప‌క్క‌నే ఉన్న గ‌న్ మెన్ గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో తెలంగాణ జ‌న జాగృతి సంస్థ కార్య‌క‌ర్త సాయి భుజం నుంచి బుల్లెట్ దూసుకు వెళ్లింది. దీంతో త‌న‌కు తీవ్రంగా గాయం కావ‌డంతో హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న (Teenmar Mallanna) చేయికి గాయ‌మైంది.

Teenmar Mallanna Shocking Comments

ఈ సంద‌ర్బంగా ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ (Teenmar Mallanna). త‌నపై హ‌త్యాయ‌త్నం చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని అన్నారు. ఇక తాడో పేడో తేల్చుకుంటామ‌న్నారు. ఆఫీస్ ఎదుట మీడియాతో మాట్లాడారు. హత్యా యత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. ఇలాంటి దాడులకు మల్లన్న భయపడుతాడు అనుకుంటే అది మీ భ్రమే అవుతుందని విమర్శించారు.

‘మా గన్‌మెన్ వద్ద నున్న తుపాకీ లాక్కొని మరీ మా సిబ్బందిపై దాడి చేశారని ఆరోపించారు. నాతో సహా పలువురికి గాయాలు అయ్యాయని అన్నారు. కల్వకుంట్ల కవిత ఆమె కుటుంబం మాపై హత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఇక తాము ఊరుకోం.. మీరో, మేమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కంచం-మంచం అనేది తెలంగాణలో ఊతపదమ‌న్నారు. నేను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నానని ప్ర‌క‌టించారు.

నేనేం తప్పు మాట్లాడానో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. రౌడీల్లా మాపై దాడి చేయడమే కాకుండా.. మళ్లీ నామీదే కేసు పెట్టడం దారుణ‌మ‌న్నారు. నా ఆఫీస్‌లో నా రక్తం కళ్ల జూశారన్నారు.. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళ్తానని ప్ర‌క‌టించారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి. ఈ దాడి ఘటనపై ఇప్పటికే కంప్లైంట్ చేశామ‌న్నారు మ‌ల్ల‌న్న‌. పోలీసులపై, వ్యవస్థపై మాకు నమ్మకం ఉందన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నామని తీన్మార్ మలన్న చెప్పారు.

Also Read : Ex Vice President Venkaiah Naidu- Kota Death : విల‌క్ష‌ణ న‌టుడికి వెంక‌య్య నాయుడు నివాళి

Exit mobile version