కరీంనగర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో పాటు మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి గురువారం గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆయన వెంట మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , తదితర సీనియర్ నాయకులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ నేరుగా జగిత్యాలలోని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికి వెళ్లారు. ఆయనకు సాదర స్వాగతం లభించింది.
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ తనను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన చెందారు జీవన్ రెడ్డి. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ తన స్టాండ్ ను మరిచి పోయిందని, కేవలం డబ్బులు, హోదా, పదవుల పందేరం కొనసాగుతోందని ఆరోపించారు. ఆపై సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, తన వల్ల 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం ఉందని మండిపడ్డారు. దీంతో తనను బుజ్జగించేందుకు పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు. అయినా వినిపించు కోలేదు జీవన్ రెడ్డి. తొలుత బీజేపీలోకి పోతారని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో బీఆర్ఎస్ తీర్తం పుచ్చుకున్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీఆర్ఎస్ కే ఛాన్స్ ఉందన్నారు జీవన్ రెడ్డి.
















