MLC Rajendra Prasad : అమరావతి : జగన్మోహన్ రెడ్డి నీచ, శవ రాజకీయాలు పరాకాష్టకు చేరాయని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రాసాద్ (MLC Rajendra Prasad) విమర్శించారు. ప్రభుత్వ విధానాలను విమర్శించొచ్చు, ప్రభుత్వ పరంగా రాజకీయం చేస్తే తప్పు లేదు కానీ దుర్ఘటనలు, మరణాలపై రాజకీయం చేయడం దారుణమని మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కర్నూల్ బస్సు ప్రమాద ఘటన అందరినీ కలిచి వేసిందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుందన్నవారు. దుబాయ్ లో ఉన్న సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారన్నారు. మంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు జరిగేలా చూశారని అన్నారు. బాధితులకు ధైర్యం చెప్పారన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని సహాయక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
MLC Rajendra Prasad Slams YSRCP
కులం, మతం ప్రాంతం, రాజకీయ పార్టీలు అని తేడా లేకుండా స్పందించాల్సిన సమయంలో వైసీపీ పార్టీ మాత్రం నీచ రాజకీయాలను ఎంచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కర్నూలు బస్సు ప్రమాద విషయంలో వైసీపీ, సాక్షీ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్న మీడియా ఛానెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అర్ధరాత్రి బెల్టు షాపులు నడుస్తున్నాయని తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం అన్నారు. చనిపోయిన బైకర్, మద్యాన్ని బెల్ట్ షాప్‌లో కాదు, ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్‌డ్ దుకాణం నుంచే కొనుగోలు చేసినట్టు సీసీటీవీ ఫుటేజీలో ఉందన్నారు.
Also Read : CM Chandrababu Cyclone Warning : తుపాను ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి















