MLC Mallanna : హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న (MLC Mallanna) అలియాస్ చింతపండు నవీన్ ఇంతకు ముందు ప్రకటించినట్లుగానే కొత్త పార్టీని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ లోని తాజ్ హోటలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 17 అనేది బహుజనులకు కీలక మలుపు కాబోతోందన్నారు. ఈ రోజుకు అద్భుతమైన చరిత్ర ఉటుందన్నారు. తెలంగాణలోని మెజారిటీ సమాజానికి రాజకీయ వేదికను అందించమే లక్ష్యంగా పెట్టుకున్నామని , అందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేశామన్నారు. కేవలం 6 లేదా 7 శాతం మాత్రమే జనాభా ఉన్న సామాజిక వర్గం రాష్ట్రంలో అధికారాన్ని కలిగి ఉండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
MLC Mallanna Shocking Update
60 శాతానికి పైగా బీసీలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వారికి రాజ్యాధికారం ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న. 17ని వెనుకబడిన తరగతుల (బీసీలు) కోసం ఒక మైలురాయి దినంగా తాను భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో మెజారిటీగా ఉన్న బీసీ సమాజానికి రాజకీయ వేదికను అందించడానికి పార్టీ ఏర్పడిందని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కుల సర్వే నివేదికపై మండిపడ్డారు. దానిని తగుల బెట్టినందుకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై గత మార్చి 1న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2000ల ప్రారంభం నుండి జర్నలిస్టుగా పేరు పొందాడు. యూట్యూబ్ వేదికగా సంచలనంగా మారారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు.
Also Read : IT Raids Sensational : తెలుగు రాష్ట్రాలలో ఐటీ దాడులు
