MLC Kavitha : హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకలవ్య భవనాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించిన ఎరుకల సాధికారత పథకాన్ని కావాలని నిర్లక్ష్యం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ విషయం గురించి శాసన మండలిలో పదే పదే డిమాండ్ చేసినప్పటికీ చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్య జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఏకలవ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఏకలవ్య కథ బహుజనులు ఎదుర్కొంటున్న అణచివేతకు సూచన అని, త్యాగం, పట్టుదలకు చిహ్నంగా నిలుస్తుందని ఆమె అన్నారు.
MLC Kavitha Comment About Ekalavya Bhavan
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాంతీయ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను దాచి పెట్టడంతో రైతులు ఉద్రిక్తంగా ఉన్నారని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకుల వర్గానికి అవకాశం కల్పించాలని కవిత అన్ని రాజకీయ పార్టీలను కోరారు. రూ. 500 కోట్ల నిధులతో ఎరుకుల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఎరుకుల కుటుంబాల కోసం తమ హయాంలో మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పారు. ఈ పథకం ద్వారా 50,000 ఎరుకుల కుటుంబాలకు రూ. 60 కోట్ల వరకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దానిని పక్కన పెట్టే బదులు, ప్రభుత్వం దీనిని బలోపేతం చేసి అమలు చేయాలని స్పష్టం చేశారు.
Also Read : TTD EO Shyamala Rao Interesting Update : అలిపిరి టోల్ గేట్ విస్తరణకు చర్యలు – ఈవో















