Kavitha : వనపర్తి జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) నిప్పులు చెరిగారు. రాష్ట్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఓ వైపు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలలో కనీస వసతులు కల్పించక పోవడం పట్ల మండిపడ్డారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పని చేసి , మంత్రిగా ఉన్నప్పటికీ పదవిని అడ్డం పెట్టుకుని అడ్డుగోలు పనులు చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. అవినీతి, అక్రమాలకు పాల్పడడం మంచి పద్దతి కాదన్నారు. ఈ జిల్లాకు తాను ఏం చేశారో చెప్పాలన్నారు.
Kavitha Slams Congress Govt
తన గురించి ఎక్కడైనా నిరంజన్ రెడ్డి నోరు జారినా లేదా అనవసర కామెంట్స్ చేసినా ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు. పుచ్చ లేచి పోతుందన్నారు కల్వకుంట్ల కవిత. రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా విద్యార్థులు మరణించినా విద్యా శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి విద్యార్థుల మరణాలపై సమీక్ష చేయక పోవడం దారుణం అన్నారు. బతుకమ్మ పేరుతో ఇచ్చిన చీరలను ఇందిరమ్మ చీరలు అని పేరు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కక్షపూరిత వ్యవహారం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా ఏదుల రిజర్వాయర్ ను పట్టించుకోక పోవడాన్ని కూడా తీవ్రంగా తప్పు పట్టారు.
Also Read : Vijayawada Police Sensational : నక్సలైట్ల విచారణ కోసం కోర్టులో పిటిషన్
















