ఇల్లు కూల్చ‌కుండా మూసీ సుంద‌రీక‌ర‌ణ చేయాలి

సీఎం రేవంత్ రెడ్డికి సూచించిన ఎమ్మెల్సీ వెంక‌న్న

helloteluguu-GoretiVenkannaa

హైద‌రాబాద్ : రాష్ట్ర స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరేటి వెంక‌న్న‌. ఆయ‌న ప్ర‌జా వేదిక‌గా మూసీ ప్రాజెక్టు సుందీక‌ర‌ణ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం దీనిని చేస్తున్నారో కూడా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీఎంను ఉద్దేశించి మూసీ నది సుందరీకరణ చెయ్యి కానీ ఒక్క ఇల్లు కూల్చకుండా చేయాల‌ని కోరారు గోరేటి వెంక‌న్న‌. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి ఎక్కువ మాట్లాడుతుంది కదా..మరి పేదల ఇండ్లు కూల్చితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అని ప్ర‌శ్నించారు.

మూసీ నది వెనుక సాంఘిక, ఆర్థిక, నైతిక, ప్రాంతీయ అభివృద్ధి వెనకాల స్వప్రయోజనాలు దాగి ఉన్నాయని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు గోరేటి వెంక‌న్న‌. ముందు కంపెనీల నుండి వచ్చే వ్యర్థాలను రాకుండా చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి నీకు కమ్యూనిస్టు పార్టీలతో ఎలాగో పొత్తు ఉంది కదా సాంబశివరావును పిలిచి మాట్లాడు. ఆ త‌ర్వాత మూసీ గురించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. మూసీ డెవలప్మెంట్ పేరు మీద ఇంత చేస్తున్నారు కదా, అదే ప్రతిపక్షంలో మీరు ఉంటే ఉద్యమం చేసే వారా అని నిల‌దీశారు గోరేటి వెంక‌న్న‌. ప్ర‌జాస్వామ్యం అంటే ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాలే త‌ప్పా వారిని ఇబ్బంది పెట్ట కూడ‌ద‌ని పేర్కొన్నారు. ఇలా చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి నిన్ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని పేర్కొన్నారు. ఇక‌నైనా ఈ నిర్ణ‌యం ప‌ట్ల పున‌రాలించు కోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Exit mobile version