Dasoju Sravan : హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని దేశం అంతా ఊరేగుతున్నారని కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో నిరంకుశత్వం కొనసాగుతోందన్నారు. గ్రూప్-1 విషయంలో ప్రభుత్వం బాగోతం బయట పడిందన్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దానికి విలువ లేకుండా చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. టీజీపీఎస్సీ తప్పులు చేసిందని అభ్యర్థులు కోర్టుకు వెళ్తే హైకోర్టు అభ్యర్థుల వాదనను సమర్ధించిందన్నారు.
Dasoju Sravan Slams Congress Govt
సీఎం రేవంత్ రెడ్డి ఖరీదైన పోలీస్ స్టేషన్ లాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీపీఎస్సీ చైర్మన్‌ను కూర్చో బెట్టుకుని రివ్యూ చేశారని, టీజీపీఎస్సికి డిఫాక్టో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దాసోజు శ్రవణ్. తప్పు జరిగిందని ప్రభుత్వం నుంచి ఎవరూ చెప్ప లేదన్నారు. తేలుకుట్టిన దొంగల్లా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ స్కామ్ మాదిరిగా తెలంగాణలో గ్రూప్-1 కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రూప్-1 మెయిన్స్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయినా సర్కారుకు , సీఎంకు సోయి లేకుండా పోయిందన్నారు. సీఎం, టీజీపీఎస్సీ చెంప పగలగొట్టే విధంగా హైకోర్టు తీర్పు వచ్చిందన్నారు.
Also Read : Popular Actor Nagarjuna Meet Modi : మోదీని కలిసిన క్షణం అద్బుతం : నాగార్జున
















