Balmoori Venkat : హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmoori Venkat) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. జూబ్లీహిల్స్ ఫలితాలతో కేటీఆర్ కు మైండ్ దొబ్బిందన్నారు. పులకేశి లెక్క మాట్లాడుతున్నాడటూ ఎద్దేవా చేశారు. ఓ ఎమ్మెల్యే పై విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ విషయం తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఐఏఎస్ లను విచారించాలంటే తప్పనిసరిగా డీఓపీటీ నుంచి పర్మిషన్ పొందాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ తీసుకునే చట్టపరంగా ముందుకు వెళ్తోందని చెప్పారు బల్మూరి వెంకట్. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివరాలు ఉంటే చెప్పాలని, లేదా ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు.
Balmoori Venkat Slams KTR
కానీ అడ్డగోలుగా మాట్లాడటం మంచి పద్దతి కాదంటూ కేటీఆర్ కు హితవు చెప్పారు ఎమ్మెల్సీ. విషయాన్ని తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరంటూ వార్నింగ్ ఇచ్చారు బల్మూరి వెంకట్. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ ఏంటో బీఆర్ఎస్ ఏంటో తేలిపోతుంది అన్నావు. కారుకు బుల్డోజర్ కు మధ్య పోటీ అన్నావు, ఏమైంది అంటూ ప్రశ్నించారు. కారును జూబ్లీహిల్స్ ప్రజలు బండకేసి కొట్టారని, అయినా సిగ్గు లేకుండా మాట్లాడితే ఎలా అంటూ ఫైర్ అయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో మాట్లాడాల్సింది పోయి లై డిటెక్టర్ పరీక్షలు అని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : Minister Nara Lokesh New Innovation : విద్యార్థినుల కోసం కలలకు రెక్కలు పథకం


















