తిరుమల : తిరుమలలో తవ్వే కొద్దీ అక్రమాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొన్నటి దాకా లడ్డూ నెయ్యిలో కల్తీ, పరకామణిలో చేతి వాటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాంలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో కుంభ కోణం బయట పడింది. ఇందుకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే , టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ. ఆయన పాలక మండలి సమావేశంలో కీలక ప్రకటన చేశారు. తిరుమలకు నిత్యం ఎందరో ప్రముఖులు వస్తుంటారు. ఆలయ మర్యాద ప్రకారం శాలువా కప్పడం ఆనవాయితీగా వస్తోంది. గత పాలక మండలి హయాంలో బయట మార్కెట్ లో రూ. 600 ఉండగా రూ. 1334 కు కొనుగోలు చేశారని తెలిపారు.
దీంతో వీటి కొనుగోలుపై అనుమానం వచ్చిందన్నారు జ్యోతుల నెహ్రూ. ఇందుకు సంబంధించి ఆరోపణలు చేసిన వెంటనే తక్షణమే స్పందించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ మేరకు ఏసీబీతో విచారణకు ఆదేశించారు. తిరుపతిలో శాలువ కొనడానికి వెళ్లిన సమయంలో అనుమానం వచ్చినట్లు తమకు తెలియ చేశారని పేర్కొన్నారు. విషయం తెలియగానే కొనుగోళ్లు నిలిపి వేశామన్నారు. బోర్డు సమావేశంలో చర్చించి విచారణకు ఆదేశించడం జరిగిందన్నారు. ఈనెల 14న జరగబోయే మీటింగ్ లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు టీటీడీ చైర్మన్ .



















