Raja Singh : హైదరాబాద్ – గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో నా మనిషే అంటే, ఎన్నో ఏళ్ల నుండి ప్రాణం పెట్టి పనిచేసిన పాత కార్యకర్తలు ఎక్కడికి పోవాలంటూ ప్రశ్నించారు. బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టదని, వాళ్ళు వేరే రాష్ట్రాలను చూసుకుంటారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పెద్ద బాబులు చెప్పిందే అధిష్టానం వింటుందన్నారు. వాళ్ల పేర్లు ఇప్పుడు చెప్పలేనని, కానీ వాళ్ల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్నారు.
MLA Raja Singh Shocking Comments on BJP
సోమవారం రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తనను కావాలని కొందరు టార్గెట్ చేశారని ఆరోపించారు. అందుకే తాను తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. బీజేపీకి బయట ఎవరూ శత్రువులు లేరని, తమ పార్టీలోనే కొందరు ఉన్నారంటూ వాపోయారు. వారి వల్లనే పార్టీకి తీరని నష్టం వాటిల్లిందన్నారు. అయితే బీజేపీలోనే ఉంటూ సర్వ నాశనం చేసేందుకు కొందరు నేతు ప్రయత్నం చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.
ఇదిలా ఉండగా తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే తనను సస్పెండ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీకి రాజీనామా చేశానే తప్పా ఎమ్మెల్యే పదవికి కాదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. అంతర్గత విభేదాల వల్లనే తెలంగాణ బీజేపీ ముందుకు రావడం లేదన్నారు. కొందరు కోవర్టులుగా పని చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : Popular BJP Leader Madhavilatha – Free Bus : ఫ్రీ బస్సు పథకం నిరుపయోగం

















