MLA Raj Gopal Reddy : నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Raj Gopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో ఒక్కసారిగా యువత ఆగ్రహంతో ఊగి పోయారు నేపాల్ లో. చివరకు రాజ్యం దిగిరాక తప్పలేదు. ఆర్మీ కూడా చేతులెత్తేసింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మేలుకోవాలని లేక పోతే ఇబ్బందులు ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు.
MLA Raj Gopal Reddy Shocking Comments
తెలంగాణలో కూడా నిరుద్యోగులు , యువతీ యువకులు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారని, వారికి సరైన సమయంలో భరోసా ఇవ్వక పోతే తీవ్ర ఇక్కట్లు నెలకొనే ప్రమాదం పొంచి ఉందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించ లేదన్నారు. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దని కోరారు. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. వారి ఆగ్రహం, కోపం పెను తుపానుగా మారక ముందే సర్కార్, సీఎం మేలుకొంటే మంచిదన్నారు.
Also Read : Urban Company Shares Growth : అర్బన్ కంపెనీ షేర్లు జోరుగా లిస్టింగ్
















