MLA Pocharam Srinivas Reddy : హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సంచలన వ్యాఖ్యల చేశారు. ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు విచారణకు హాజరయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో కేసు వేయడంతో వెంటనే విచారణ చేపట్టాలని, చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో స్పీకర్ ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడారు. తనకు పదవులు ముఖ్యం కానే కాదన్నారు. తాను ముందు నుంచి ప్రజల కోసం పని చేసిన వ్యక్తినని, ఈ విషయం తన నియోజకవర్గంలోని ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
MLA Pocharam Srinivas Reddy Shocking Comments
తాను ఏ తప్పు చేయలేదని, ప్రజా సేవకు తన జీవితం అంకితం చేశానని అన్నారు. తనకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదన్నారు. అవసరం అయితే రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు శ్రీనివాస్ రెడ్డి. ప్రజలకు హానీ కలిగించే పని జీవితంలో చేయబోనని స్పష్టం చేశారు. ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు పోచారం . ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని, ఇప్పటి వరకు అలాగే ఉన్నానని చెప్పారు. తన శరీరంలో శ్వాస ఉన్నంత వరకు ఇలాగే జీవిస్తానని అన్నారు. కానీ, కొంతమంది కావాలనే నా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఏదో ఆశించి సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని నెగిటివ్‌గా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
Also Read : MLA Anirudh Reddy Brother Shocking : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోదరుడికి బిగ్ షాక్















