Padi Kaushik Reddy : హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయడానికి తగిన బడ్జెట్ వెంటనే కేటాయించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా ఇల్లంతకుంట మండలం లో పుర్తిగా ధ్వంసం అయిన రాచపల్లి నుండి బూజునూర్ గ్రామం వెళ్లే రోడ్డు, నాగంపేట నుండి రాచపల్లి వెళ్లే రోడ్డు , రాచపల్లి బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయి లో కుంగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వీటికి నిధులు మంజూరు చెయ్యాలని కోరారు పాడి కౌశిక్ రెడ్డి.
BRS MLA Padi Kaushik Reddy Requests Incharge Minister Tummala
నియోజకవర్గంలోని ఇతర ప్రధాన రహదారులు, కాల్వల ప్రాజెక్ట్ నిర్మాణం, శాశ్వత మౌలిక వసతులు హుజురాబాద్ స్కూల్ గ్రౌండ్ వంటి పలు కీలక ప్రాజెక్టులు నిలిచి పోయాయని, వీటి గురించి గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా వివరంగా చెప్పినట్లు ఈ సందర్బంగా గుర్తు చేశారు పాడి కౌశిక్ రెడ్డి . హుజురాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం కనీసం వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేసి, అనుమతులు పొందిన పనులు సహా పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే చేసిన అభ్యర్థనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. వెంటనే రోడ్లు, వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు.
Also Read : TCS Hyper Vault Excitement : హైపర్ వాల్ట్ ఏర్పాటుపై ఎడతెగని ఉత్కంఠ















